విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనాన్ని ముట్టడి చేయనున్న కార్మికులు

Tuesday, March 9th, 2021, 09:48:24 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోనీ విశాఖ ఉక్కు పరిశ్రమ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విశాఖ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. అంతేకాక పార్లమెంట్ లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గళమెత్తగా అందుకు నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పుకొచ్చారు. వంద శాతం ప్రైవేటీకరణ తథ్యం అన్నట్లు గా వ్యాఖ్యలు చేయడం తో ప్రస్తుతం అక్కడ పరిస్థుతులు ఆందోళన కలిగిస్తోంది. అయితే నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల పట్ల రాత్రి నుండి కూడా ఆందోళన లు మిన్నంటాయి. కార్మికులు అంతా కూడా మానవహారం గా ఏర్పడి రహదారులను దిగ్బంధిస్తున్నారు.పలు చోట్ల ఇంకా నిరసన లు కొనసాగుతూనే ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం ప్రకటన తో ఉన్న ప్రతులను దగ్దం చేశారు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేడు విశాఖ ఉక్కు పరిశ్రమ కి చెందిన పరిపాలన భవనాన్ని ముట్టడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు కార్మికులు.