సెల్యూట్ తెచ్చిన తిప్పలు

Thursday, September 25th, 2014, 05:20:30 PM IST


నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేస్తాం.. అది భారతదేశ సంస్కృతిలో ఒక భాగం.. అదే ఇతరదేశాలలో అయితే.. సెల్యూట్ చేస్తే.. ప్రతిగా సెల్యూట్ చేస్తారు.. ఇది అక్కడి ఆచారం.. అయితే.. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ఒబామాకు మెరైన్ కార్ఫ్ గార్డ్ చేసిన సెల్యూట్ కు ప్రతిగా సెల్యూట్ చేశారు.. ఇప్పుడు ఈ సెల్యూట్ వివాదాస్పదంగా మారింది.

యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఒబామా.. న్యూయార్క్ నగరానికి హెలికాఫ్టర్ లో వచ్చారు. హెలికాఫ్టర్ దిగుతున్న ఒబామాకు.. మెరైన్ కార్ఫ్ గార్డ్స్ సెల్యూట్ చేశారు.. ఇందుకు ప్రతిగా ఒబామా సెల్యూట్ చేశారు. కాకపొతే.. సెల్యూట్ చేసిన చేతిలో కాఫీ కప్పు ఉండటంలో ఇప్పుడు అది సంచలంగా మారింది.

ఓబమా చేసిన సెల్యూట్ తో గార్డ్స్ కు అవమానం జరిగిందని కొందరు వాదిస్తున్నారు… అయితే, ఒబామా సివిల్ వ్యక్తీ అని, ఆయన గార్డ్స్ కు సెల్యూట్ చేయవలసిన అవసరం లేదని.. దీన్ని పెద్ద విషయంగా పట్టించుకోవలసిన అవసరంకూడా లేదని ఒబామా అనుకూల వాదులు అంటున్నారు.