పుదుచ్చేరి సీఎం కి కరోనా వైరస్ పాజిటివ్

Monday, May 10th, 2021, 08:30:09 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ రంగానికి చెందిన వారు ఈ మహమ్మారి భారిన పడ్డారు. అయితే తాజాగా పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి రంగస్వామి కరోనా వైరస్ భారిన పడ్డారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన నాలుగు రోజులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే పుదుచ్చేరి లోని ఇందిరా గాంధీ వైద్య కళాశాల లో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు ముఖ్యమంత్రి రంగస్వామి. అయితే చికిత్స కోసం ప్రస్తుతం ఆయన చెన్నై వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నెల 7 వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన ఈయన, ఆ కార్యక్రమం కి హాజరు అయిన మరో 11 మందికి కూడా కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయ్యింది.

ఒక పక్క దేశం లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాప్తి చెందుతుంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో కరోనా వైరస్ మరణాలు దేశం లో నమోదు అవుతున్నాయి. ప్రజలు, అధికారులు, అంతా కూడా మరింత అప్రమత్తం గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.