22 నుంచి నిరాహార దీక్ష : కృష్ణయ్య

Saturday, January 17th, 2015, 05:22:36 PM IST


ఫీజుల బకాయిల విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని… అసలు ఆ విషయాలగురించి తెలంగాణ ప్రభుత్వం పక్కకు పెట్టిందని ఎల్బీ నగర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. దీనికి నిరసనగా, ఈనెల 22 నుంచి నిరాహార దీక్షా చేస్తామని అన్నారు. దాదాపు వందమంది బీసీ సంఘాల నేతలతో దీక్ష చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. 16లక్షల మంది బకాయిల చెల్లింపులపై తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో బకాయిల చేల్లిపు పూర్తీ అయి, కొత్త దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్నదని అన్నారు. తెలంగాణలో మాత్రం విద్యార్ధుల భవిష్యత్ తో ప్రభుత్వం ఆడుకుంటున్నదని ఆయన మండిపడ్డారు.