రహానే రఫ్ఫాడించాడు

Friday, December 4th, 2015, 10:56:04 AM IST


‘విదేశీ గడ్డపైనే ఆడతాడు..స్వదేశీ పిచ్ లపై ఆడలేడు’ అనే అపకీర్తి ఉన్న రహానే నేడు ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్లో సెంచరీతో రఫ్ఫాడించాడు. ఆరంభంలోనే తడబడి ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన భారత్ మెల్లగా పుంజుకొని ఆటలో పై చేయి సాదించింది. తొలుత ధావన్ (33), కోహ్లీ (44) పరుగులతో ఆదుకున్నా ఎక్కువసేపు గ్రీజ్ లో నిలవలేకపోయారు. తరువాత బ్యాటింగ్ కు దిగిన రహానే మెరుగైన ఆటతీరుతో మెల్లగా గ్రీజ్లో పాతుకుపోయి సెంచరీ పూర్తి చేశాడు.

ప్రస్తుతం రహానే(127)ల వద్ద ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్ లో ఓటవయ్యాడు. రహానే తరువాత ఉమేష్ యాదవ్ గ్రీలోకి వచ్చాడు. ప్రస్తుతం యాదవ్(0), అశ్విన్(29) పరుగులతో గ్రీజ్ లో ఉన్నారు. రహానే కు ఇది ఐదో టెస్టు సెంచరీ కాగా స్వదేశీ గడ్డపైన తోలి సెంచరీ. దీంతో భారత్ గడ్డపై సెంచరీ చేయాలన్న రహానే కల నెరవేరింది. ఇంకో విశేషమేమిటంటే భారత్ తరపున గానీ, దక్షిణాఫ్రికా తరపున గానీ ఈ టెస్టు సిరీస్ లో ఇప్పటి వరకూ రహానే తప్ప ఏ ఆటగాడూ సెంచరీ సాదించలేదు.