కరోనా ను అడ్డుకోవాలంటే సంపూర్ణ లాక్ డౌన్ ఒక్కటే మార్గం – రాహుల్ గాంధీ

Wednesday, May 5th, 2021, 07:38:35 AM IST

దేశం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ మూడు లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మూడు వేలకు పైగా కరోనా వైరస్ మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే ఈ మహమ్మారి ను అడ్డుకోవాలంటే సంపూర్ణ లాక్ డౌన్ ఒక్కటే మార్గం అంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలిపారు. కరోనా ప్రభావిత వర్గాలకు రక్షణ కల్పిస్తూ లాక్ డౌన్ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం చేతగాని తనం వలన అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇది ప్రభుత్వానికి అర్దం కావడం లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం వద్ద ఎలాంటి వ్యూహం లేనందున ఇక లాక్ డౌన్ అనే ప్రత్యామ్నాయం మిగిలి ఉంది అంటూ రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

అయితే నిజానికి వైరస్ వ్యాప్తి కట్టడి చేయలేని స్థాయికి చేరుకోవడానికి ఒక రకంగా వారే దోహదం చేశారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలా చేయడం ద్వారా భారత్ పై పెద్ద నేరమే జరిగిపోయింది అంటూ తెలిపారు.అయితే రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. నీచ రాజకీయాలు చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.