మోడీ రాహుల్ ఫై కక్షసాదిస్తున్నారా..?

Friday, December 11th, 2015, 01:41:23 AM IST


ఉత్తర ప్రదేశ్ లోని అమెథి నియోజక వర్గంలో ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులను రద్దు చేయడమే కాకుండా.. అక్కడ ఏర్పాటు చేయాలనుకున్న కొన్ని ప్రాజెక్టులను అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇటీవలే అమెథి నియోజక వర్గంలో 3600 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలనుకున్న పేపర్ మిల్ ప్రాజెక్టును అక్కడి నుంచి మహారాష్ట్రలోని రత్నగిరికి తరలించింది. దీనిపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా 900 మందికి ఉపాది కలుగుతుంది.

అయితే, తొలుత దీనిని అమెథి ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, అమెథి ఎంపీ రాహుల్ గాంధి తీవ్రంగా ప్రయత్నించారు. కాని, శివసేన డిమాండ్ తో ప్రాజెక్ట్ మహారాష్ట్రకు తరలిపోయింది. అంతేకాకుండా, అమెథి నియోజక వర్గంలో జగదీశ్ పూర్ లో శక్తిమాన్ మెగాఫుడ్ పార్క్ ను ఏర్పాటు చేయాలనీ అనుకున్నారు. యూపీఏ హయాంలోనే ఈ ప్రాజెక్ట్ ను అనుకున్నా.. అప్పటి ప్రభుత్వం సబ్సిడీకి పెట్రోల్ ను సరఫరా చేసేందుకు అంగీకరించక పోవడంతో.. ఈ ప్రాజెక్టును ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. మోడీ ప్రభుత్వం కావాలనే తనపై కక్షసాధిస్తున్నదని రాహుల్ గాంధి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. యూపీఏ హయాంలో ప్రాజెక్టులను ప్రతిపాదించినా.. వాటిని అమలు చేయడంలో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నది.