రాహుల్ గాంధీ కి కరోనా వైరస్ పాజిటివ్

Tuesday, April 20th, 2021, 04:00:06 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశం లో కొనసాగుతూనే ఉంది. అయితే ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ రంగానికి చెందినవారు కూడా ఈ మహమ్మారి భారిన పడుతున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కరోనా వైరస్ భారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే కరోనా వైరస్ స్వల్ప లక్షణాలు కనిపించడం తో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. అయితే ఫలితం కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చిన విషయాన్ని వెల్లడించారు. అయితే తనతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారు జాగ్రత్తలు తీసుకోండి అంటూ సూచన ఇచ్చారు. అయితే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన ప్రజలు ఆందోళన చెందుతున్నారు.