ఫ్లైట్ దిగిన ‘రాహుల్’ అధ్యక్ష పీఠం ఎక్కనున్నారా..?

Monday, January 11th, 2016, 10:17:00 AM IST


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూరప్ పర్యటనను ముగించుకుని నిన్ననే తిరిగోచ్చారు. ఈ సందర్బంగా ఆయన ఈ సోమవారం పార్టీ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. గత నెల 28న కొత్త సంవత్సరం వేడుకల కోసం యూరప్ వెళ్ళిన ఆయన తాను సెలవులో ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన రాజకీయ పరిణామాలను గురించి తెలుసుకునేందుకు ఈ మీటింగును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సారి ఆయన కాంగ్రెస్ కు
అధ్యక్ష భాద్యతలను చేపట్టే అవకాశం కూడా ఉందని కొందరు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియా గాంధీ ఇక నుంచి పార్టీ భాద్యతలను పూర్తిగా రాహుల్ కు అప్పగించాలని అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో బాగా వెనుకపడిన సంగతి తెలిసిందే. అయితే ఆ పరిస్థితుల్లో కూడా ఏమాత్రం వెనకడుగేయకుండా రాహుల్ అధికార పక్షంపై విమర్శలు కురిపిస్తూ పార్టీని ముందుకు నడిపిన తీరును, పార్టీలో ఉన్న అన్ని విభాగాల్లో ఆయనే కీలకమైన పరిస్థితి చూస్తుంటే తొందరలోనే రాహుల్ అద్యక్ష పీఠాన్ని అధిష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది.