రాజ్యసభలో దుమారం రేపిన జేఎన్‌యూ వివాదం

Wednesday, February 24th, 2016, 06:05:03 PM IST


ఈరోజు రాజ్యసభ సమావేశాలు జరిగేముందు ఎట్టి పరిస్థితుల్లో అనవసర వాదనలు, వాయిదాలు ఉండకూడదని అధికార, ప్రతిపక్షాలకి సూచించారు మోదీ, ప్రణబ్. దీనికి ఇరువురు ఆమోదం కూడా తెలిపారు. అనుకున్నట్టే ఉదయం సభ ప్రశాంతంగానే ముగిసుంది. సభ అనంతరం బయటకొచ్చిన రాహుల్ ‘అధికార పక్షం నన్ను మాట్లాడనివ్వ లేదు. నేను ఎం మాట్లాడతానో అని బయపడింది. నేనుఇ మాట్లాడేటప్పుడు చూడండి కావాలనే ప్రభుత్వం అడ్డుపడుతుంది’ అన్నారు. అలాగే రోహిత్, జేఎన్ యూ అంశాలను చర్చించాలని డిమాండ్ చేశాం. అందుకు వారు కూడా ఒప్పుకున్నారు అన్నారు.

ఆయన అన్నట్టుగానే సాయంత్రం సభలో అవే అంశాలు చర్చకు వచ్చాయి. ఈ చర్చల్లో బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ అఫ్జల్ గురూ దేశ ద్రోహో లేక కాదో సోనియా గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కూడా హైదరాబాద్ స్టూడెంట్ రోహిత్ విషయంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఇలా వాదనలు తారా స్థాయికి చేరడంతో డిప్యూటీ స్పీకర్ కురియన్ సభను గురువారానికి వాయిదా వేశారు.