రామ్ చరణ్, ఎన్టీఆర్ మరో ప్రాజెక్ట్ చేపట్టేది అప్పటినుండేనా?

Sunday, February 21st, 2021, 11:04:48 PM IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ను ఊహించిన దాని కంటే ఎక్కువ రోజులు సమయం పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం రెండు సార్లు వాయిదా పడింది. అటు రామ్ చరణ్ తన తర్వాత ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినా ఇంకా పనులు మొదలు కాలేదు. అదే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరొక చిత్రాన్ని చేయాల్సి ఉంది. అయితే జక్కన్న ఇంకా ఎన్ని రోజులు ఈ ఇద్దరు హీరోలను హోల్డ్ చేస్తారు అనే దాని పట్ల టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి.

అయితే రాజమౌళి ఇండస్ట్రీ లో క్వాలిటీ ఔట్ పుట్ ఇస్తారు అనే విషయం అందరికి తెలిసిందే. అంతేకాక బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఇప్పటికే అక్టోబర్ 13 న విడుదల కానున్న విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ల పాత్రల కి సంబందించిన షూటింగ్ ను ఏప్రిల్ వరకూ పూర్తి చేస్తారు అని సమాచారం. అనంతరం వారు తమ తదుపరి ప్రాజెక్ట్ లలో నటించనున్నారు. అంతా ఎదురు చూస్తున్న ఈ చిత్రం లో బాలీవుడ్ నటులు అలియా భట్, అజయ్ దేవగన్ లతో పాటుగా, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.