ఆ సినిమాకోసం చరణ్ కూడా వెయిటింగ్.. ?

Saturday, January 2nd, 2016, 06:21:53 PM IST

బ్రూస్ లీ తరువాత రామ్ చరణ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. బ్రూస్ లీ తరువాత చరణ్ తమిళంలో హిట్ అయిన తని ఒరువన్ ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా అంతా మైండ్ గేమ్ మీదనే ఆధారపడి నడుస్తుంది. హీరోకు విలన్ కు మధ్య ఎత్తుకు పై ఎత్తులు.. వంటి వాటితోనే నడుస్తుంది. దీనిని చరణ్ రీమేక్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ సుకుమార్ ల సినిమా నాన్నకు ప్రేమతో కూడా మైండ్ గేమ్ సినిమానే. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ను చూస్తే మనకు యిట్టె అర్ధం అవుతుంది.

ఎన్టీఆర్ అనగానే భారీ ఫైట్స్ ను ఆశిస్తాం. కాని, ఇందులో అటువంటి చాలా తక్కువగా ఉంటాయి. సినిమా అంతా మైండ్ గేమ్ లా సాగుతుంది. ఇక, విలన్ పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. జగపతి బాబు నటన హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. జనవరి 13న ఈ సినిమా విడుదల కానున్నది. ఈ సినిమా కోసం సినిమా అభిమానులు మొత్తం ఎదరు చూస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారట. ఎందుకంటే.. ఈ సినిమా చూశాక.. తాను రీమేక్ చేయాలి అనుకున్న తని ఒరువన్ సినిమా స్క్రిప్ట్ లో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే చేసి.. ఆ తరువాత్ సెట్స్ మీదకు వెళ్ళాలి అనుకుంటున్నారట. ఇది సంగతి.