సాగర్‌లో నా ఓటు నోముల భగత్‌కే.. రాం గోపాల్‌ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Friday, April 2nd, 2021, 11:56:36 PM IST

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌ బరిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికలపై స్పందించిన వివాదస్పద సినిమాల దర్శకుడు రాం గోపాల్‌ వర్మ నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో తనకే గనుక ఓటు హక్కు ఉంటే తన ఓటు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కే అని చెప్పుకొచ్చారు. అంతేకాదు చిరుతపులితో నోముల భగత్‌ కలిసి నడిచే వీడియోను వర్మ ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశాడు.

అయితే ఒక అభ్యర్థి గొలుసుతో ఉన్న చిరుతపులిని పట్టుకుని ఎన్నికల్లో ప్రచారం చేయడాన్ని తొలిసారి చూశానని, సీఎం కేసీఆర్‌ ఓ సింహంలా, మంత్రి కేటీఆర్‌ను పులితో పోల్చిన రాం గోపాల్‌ వర్మ చిరుతపులిని వాకింగ్‌కు తీసుకువెళ్లిన నోముల భగత్‌ను ఇష్టపడుతున్నానని, నాకు కనుక సాగర్‌ నియోజకవర్గంలో ఓటుంటే ఈ నెల 17న జరిగే ఉపఎన్నిక పోలింగ్‌లో నోముల భగత్‌కే ఓటు వేస్తానని రాం గోపాల్‌ వర్మ తెలిపారు.