క్యాబినేట్ హోదా వద్దన్న రాందేవ్!

Tuesday, April 21st, 2015, 12:36:12 PM IST


ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబాకు హర్యానా ప్రభుత్వం క్యాబినేట్ హోదాను కల్పించి సత్కరించాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే యోగా, ఆయుర్వేదాలను ప్రమోట్ చేస్తూ హర్యానా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రాందేవ్ బాబా ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ క్యాబినేట్ హోదాను తిరస్కరించారు. ఇక రాందేవ్ కు క్యాబినేట్ పదవిని, కారు సౌకర్యం కల్పిస్తున్న విషయంలో ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనితో రాందేవ్ బాబా వెనక్కు తగ్గి ప్రభుత్వం కేటాయిస్తానన్న మంత్రి హోదాను తిరస్కరిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అలాగే హర్యానా ప్రభుత్వం తనను గుర్తించినందుకు రాందేవ్ బాబా కృతజ్ఞ్యతలు తెలిపారు.