హాట్ టాపిక్: పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాపాక

Monday, June 29th, 2020, 09:20:32 AM IST

జన సేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తాజాగా జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక వైసీపీ కి ఎందుకు అనుకూలంగా మాట్లాడుతున్నాను అనే అంశం దాని పై కీలక వ్యాఖ్యలు చేశారు.

2019 ఎన్నికలకు వైసీపీ నుండి టికెట్ ట్రై చేశా అని, కానీ టికెట్ దొరకలేదు అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో జన సేన పార్టీకి చెందినవారు వచ్చి, తమ పార్టీ తరపున పోటీ చేయాలి అని అడిగారు అని అసలు విషయం వెల్లడించారు.అయితే జన సేన పార్టీ ను పట్టించుకొనే వారు లేరు అని, కేవలం అధ్యక్షుడు మాత్రం ఉన్నారు, నిర్మాణం జరగలేదు అని అన్నారు. చిరు ప్రజలకు దగ్గరగా ఉండేవారు, పవన్ అలా కలవరు అని, చిరు కి, పవన్ కి తేడా అదే అని వ్యాఖ్యానించారు.

నాయకుడు జనాలకు దగ్గరగా ఉండాలి అని, లేదంటే ఇబ్బందులు పడాలి అని, జగన్ ప్రజలకు దగ్గరగా ఉన్నారు కాబట్టే భారీ మెజారిటీ సాధ్యం అయింది అని వ్యాఖ్యానించారు. అంతేకాక పవన్ అలా జనం దగ్గరకు వెళ్ళడం లేదు అని షాకింగ్ కామెంట్స్ చేసారు. పవన్ గెలిచిన నన్ను పక్కన పెట్టుకోకుందా నాదెండ్ల మనోహర్ ను పక్కన పెట్టుకున్నారు అని, పవన్ ను రాంగ్ రూట్ లో తీసుకెళ్తున్నారు అని వ్యాఖ్యానించారు. అంతేకాక జన సైనికుల పై కూడా రాపాక పెదవి విరిచారు. ఓటు వేసి గెలిపించదానికి పనికి రారు అని, ఇంకొకరిని తిట్టడానిక పనికొస్తారు అని వ్యాఖ్యానించారు. అంతేకాక జగన్ పథకాలు అద్బుతం అని వ్యాఖ్యానించారు.