ఆర్సీబీ కి షాక్…డేనియల్ సామ్స్ కి కరోనా పాజిటివ్!

Wednesday, April 7th, 2021, 02:16:38 PM IST

ఈ ఏడాది ఐపియల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా వైరస్ విపత్తు ముంచుకొస్తున్న వేళ ప్రతి ఒక్కరూ కూడా కరోనా వైరస్ మహమ్మారికి భయపడక తప్పడం లేదు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కి చెందిన ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం తెలిపింది. ఏప్రిల్ మూడవ తేదీన కరోనా వైరస్ నెగటివ్ రిపోర్ట్ తో ఆస్ట్రేలియా ఆటగాడు డేనియల్ బెంగుళూరు శిబిరానికి చేరుకున్నాడు. కాగా అతనికి రెండో సారి చేసిన పరీక్షల్లో పాజిటివ్ రావడం పట్ల అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అతన్ని ఐసోలేశన్ కి పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకకుండా కఠినమైన నిబంధనలను పటిస్తున్నట్లు తెలిపింది. అయితే వైద్య బృందం అతన్ని పర్యవేక్షిస్తుంది అని, బీసీసీఐ కూడా సహకరితున్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం తెలిపింది. అయితే ఈ విషయం కోహ్లీ సేన కి కాస్త ఆందోళన కల్గించే విషయం అని తెలుస్తోంది.