హాట్ టాపిక్ : వార్నర్ పెద్ద మనసు..అందుకే టిక్ టాక్ వీడియోలు!

Sunday, June 21st, 2020, 12:47:27 PM IST

దేశవాళీ ఐపీఎల్ ను ఆడేందుకు వచ్చి క్రికెటర్లు లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియో లతో అభిమానులను, ప్రజలను అసేశం గా ఆకట్టుకున్నారు. అయితే ఈ టిక్ టాక్ వీడియో లని చేయడానికి గల కారణం ను ఇటీవల వెల్లడించారు. ప్రజల ముఖాల పై నవ్వు తెప్పించేందుకు టిక్ టాక్ వీడియో లను చేసినట్లు తెలిపారు.మన ఆలోచన పరిధిని మించి మనం ఆలోచించాలి అని వ్యాఖ్యానించారు. ప్రజల మొహాల పై నవ్వు చూసేందుకు నేను, నా కుటుంబ సభ్యులు కలిసి టిక్ టాక్, ఇన్స్టా గ్రామం, ట్విట్టర్ ల ద్వారా వీడియో లని షేర్ చేశాం అను అన్నారు.

అయితే భారతీయ సినిమా ల పై కూడా స్పందించారు. అయితే తాను చేసిన డాన్స్ లకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎక్కువ మంది బుట్ట బొమ్మ పాట ను చేయమని చెప్పారు అని అన్నారు. అనంతరం అలా ప్రేక్షకుల్ని అడుగుతూనే ఆ వీడియో లను చేసినట్లు తెలిపారు. అంతేకాక ఇలా వీడియో లని చేయడం ఎంతో వినోదాన్ని కలిగించింది అని, ఈ జర్నీ, ఎంతో బావుంది అని అన్నారు. ఎంతో ఆస్వాదించి చేశాం అని అన్నారు. అయితే భారతీయ నృత్యం చాలా కష్టమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

చాలా తక్కువ కాలం లోనే డేవిడ్ వార్నర్ తన టిక్ టాక్ వీడియో లతో అభిమానులకు దగ్గర అయ్యారు. అగ్ర హీరోల పాటలకు స్టెప్పులు వేసి తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేస్తుంటే, ఇలా చేయడం, వారిని ఆనంద పరచడం బావుంది అని అన్నారు.