బిగ్ బ్రేకింగ్ : ఏపీలో రికార్డు స్థాయి పరీక్షలు.. మళ్లీ భారీగా కరోనా కేసులు..!

Friday, July 3rd, 2020, 01:08:26 PM IST

మన దేశంలోనే ఏ ఇతర రాష్ట్రంలో కూడా కరోనా విషయంలో తీసుకోని చర్యలను ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటున్నారని చెప్పాలి. కరోనాతో పోరాటంలో లో మార్గదర్శకంగా ఇప్పుడు ఏపీ నిలుస్తుంది. ప్రతీ రోజు కేసులు పెరుగుతున్నప్పటికీ వైద్య రంగం మాత్రం స్పీడ్ తగ్గించడం లేదు. ఇప్పటికే రికార్డు స్థాయి పరీక్షలు నిర్వహించారు.

అలా ఈసారి కూడా కేవలం ఒక్క రోజులో మరోసారి రికార్డు స్థాయి పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో మొత్తం 38 వేల 898 శాంపిల్స్ తీసుకోగా అందులో ఒక్క ఏపీ నుంచి 789 కేసులు నమోదు అయ్యినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు నిర్ధారణ చేశారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి మరియు దేశాల నుంచి వచ్చిన వారితో కలిపి 837 కేసులు నమోదు అయ్యాయి.

దీనితో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కేసులు 14 వేల 414 కు చేరుకుంది. ఇదిలా ఉండగా గత 24 గంటల్లోనే 258 మంది సంపూర్ణ ఆరోగ్యం తో కొలుకోగా 8 మంది మరణించారు. అయితే ఏపీలో కేవలం ఒక్కరోజులో దగ్గరగా 40 వేలు టెస్టులు చెయ్యడం ఒక రికార్డు అని చెప్పాలి.