మూవీ రివ్యూ : రెడ్

Thursday, January 14th, 2021, 03:23:44 PM IST

రామ్ ‘రెడ్’ సినిమాతో ఈ రోజు థియేటర్లలోకి వచ్చాడు. ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు. ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

కథ :

ఆదిత్య అండ్ సిద్ధార్థ్ గా రెండు పాత్రల్లో కనిపిస్తాడు రామ్. సిద్ధార్థ్ వృత్తిరీత్యా ఇంజనీర్ కాగా, ఆదిత్య ఒక దొంగ. అయితే, ఒక రోజు, ఆకాష్ అనే వ్యక్తి చంపబడతాడు. ఆ హత్య చేసింది, సిద్ధార్థ్ నే చెప్పి అతన్ని అరెస్టు చేస్తారు. కానీ, ఆదిత్య కూడా ఇదే కేసులో చిక్కుకున్నప్పుడు కథలోని అసలు పాయింట్ అండ్ ట్విస్ట్ తలెత్తుతుంది. ఇంతకీ, ఆకాష్‌ను ఎవరు చంపారు? అసలు ఆ హత్య వెనుక అలాగే కథలోని అసలు చిక్కు ముడి వెనుక మొత్తం ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? అది కథను ఎలా ముందుకు నడిపింది ? చివరకు ఆదిత్య అండ్ సిద్ధార్థ్ ఆ హత్య కేసు నుండి ఎలా బయటపడతారు ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :
సినిమాలో మెయిన్ కంటెంట్ విషయాన్ని పక్కన పెడితే ఈ చిత్రం హీరో నటించిన రెండు పాత్రల చుట్టూ తిరుగుతుందన్న సంగతి అందరికీ ముందే తెలిసిన విషయమే. అయితే రామ్ ఆ రెండు పాత్రల్లో డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపించి తనదైన నటనతో మరోసారి అదిరిపోయే పెర్ఫామెన్స్ ను అందించాడు. అలాగే ఈ సినిమాకు నటన పరంగా మెయిన్ ఎస్సెట్ నిలిచాడు. ఇక హీరోయిన్ మాలవికా శర్మ సినిమాలో అందంగా కనిపిస్తోంది. కాని ఈ చిత్రంలో ఆమెకు పెద్దగా స్కోప్ అండ్ స్క్రీన్ స్పెస్ కూడా లేదు. ఇక వెన్నెలా కిషోర్ కొన్ని సన్నివేశాల్లో కామెడీని పండించాడు. అలాగే హాస్యనటుడు సత్య తన పాత్రలో కూడా మంచి ఫన్ ను జనరేట్ చేశాడు. పోసాని అలాగే మిగిలిన నటీనటులు బాగానే నటించారు. ఇక ఈ చిత్రంలో పోలీసుల సెటప్ అండ్ సీన్స్ కూడా బాగున్నాయి. అయితే, ఇలా ఫస్ట్ మరియు సెకండాఫ్ లు జస్ట్ ఓకే గానే అనిపిస్తాయి తప్ప సినిమా చూసే ప్రేక్షకుడికి ఏమంత గొప్పగా అనిపించవు.

ఇక దర్శకుడు తన సినిమాలో పాత్రలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వారిపై నడిచే కథకు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. అలాగే నెమ్మదిగా సాగించే కథనం అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువయ్యిపోవడం, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ హంగులు లేకపోవడం వంటివి సినిమా చూసే ప్రేక్షకునికి ఈ చిత్రంపై ఆసక్తిని తగ్గించేస్తాయి. ఈ సినిమాలో పెద్ద లోపం ఏమిటంటే, ఈ చిత్రం ఆకర్షణీయమైన ట్రీట్మెంట్ లేకపోవడం. పైగా నివేదా పాత్ర బలహీనంగా ఉన్నందున దర్యాప్తు సీన్స్ కూడా సిల్లీగా అనిపిస్తాయి. అలాగే, హీరోకు నివేదా ఎందుకు సహాయం చేస్తుందో కూడా స్పష్టత లేదు. ఇలాంటి లాజిక్స్ లేనివి చాలా ఉన్నాయి. దీనికితోడు సినిమా వ్యవధి కూడా చాలా పొడవుగా ఉంది. ఆకట్టుకునే మ్యూజిక్ ఈ చిత్రంలో ఉంది. నేపథ్య సంగీతం ఓకే. ఎడిటింగ్ బాగుంది. ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే సినిమాలో సంభాషణలు ఆకట్టుకుంటాయి.

ప్లస్ పాయింట్స్ :

అన్ని యాక్షన్ సన్నివేశాలు

మెయిన్ రెండు పాత్రల మధ్య కెమిస్ట్రీ
విజువల్స్
ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్ :

కథా కథనాలు
ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండాఫ్ లలో వచ్చే సాగదీత సీన్స్
బోరింగ్ ట్రీట్మెంట్
ఇంట్రస్ట్ గా సాగని మెయిన్ సీక్వెన్స్ స్.
ముందుగానే అర్ధమయ్యే ట్విస్టులు

తీర్పు :

అంచనాలతో వచ్చిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా ఆసక్తికరంగా సాగలేదు. అయితే ఈ చిత్రంలో రామ్ వన్ మ్యాన్ ఆర్మీగా తన వన్ మ్యాన్ షోతో అదరగొట్టారు. కానీ ఏమాత్రం కొత్తదనం లేని కథ,కథనాలు, ఇంట్రస్ట్ లేని మరియు అనవసరమైన సన్నివేశాలు వల్ల సినిమా ఫలితం దెబ్బ తింది. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోదు.

Rating: 2.5/5