లక్కీ అంటే రేజీనాదే.. అడిగినంత ఇచ్చేస్తున్నారు..?

Thursday, January 7th, 2016, 05:05:44 PM IST


రేజీనా.. గ్లామరస్ కంటే.. అభినయంతోనే ఆకట్టుకుంటున్నది. అందం కంటే అభినయంతో ఆకట్టుకునే నటీమణులు ప్రస్తుతం చాలా తక్కువగా ఉండటంతో.. రేజీనాకు వరసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇకపోతే, ఈ చెన్నై స్వీటీ గల్ఫ్ వ్యాపారవేత్త అశ్వనికుమార్ తన కొడుకును ఆకాష్ ను హీరోగా పెట్టి సినిమా తీయాలని అనుకున్నాడు. ఈ సినిమాను భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఆకాష్ హీరోగా అనుకున్న సినిమాలో రేజీనాను హీరోయిన్ అనుకున్నారట. అందుకు ఆమెను సంప్రదించినట్టు కూడా తెలుస్తున్నది. అంతేకాదు.. అశ్వనికుమార్ సినిమా నటించేందుకు భారీమొత్తంలోనే ఆఫర్ చేసినట్టు కూడా సమాచారం. రేజీనా అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు సదరు ప్రొడక్షన్ సంస్థ చెప్తున్నది. ఇక, ఈ సినిమాదర్శకుడుకి కోసం ప్రస్తుతం టీం అన్వేషిస్తున్నదట. ఇక ఈ సినిమాకు శరభ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఓ హిట్ దర్శకుడిని కలిసిమాట్లాడినట్టు తెలుస్తున్నది.. త్వరలేనే అని విషయాలను అధికారికంగా ప్రకటిస్తామని ఆ ప్రొడక్షన్ సంస్థ పేర్కొంటున్నది.