టీచర్ అవతారం ఎత్తిన రేజీనా!

Sunday, December 7th, 2014, 05:08:17 PM IST


గ్లామర్ రంగలో తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ రేజీనా తాజాగా బెత్తం పట్టి గ్రామర్ పాఠాలు చెప్పేందుకు సిద్దమయింది. విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందని… అందుకు తనవంతు సహాయంగా ప్రభుత్వ పాఠశాలలో వారంలో రెండు రోజుల పాటు ఆంగ్లం బోధిస్తానని చెప్తున్నది. విద్యార్ధులకు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లంలో ప్రావీణ్యం కల్పించేదుకు టీచ్ ఫర్ చేంజ్ క్యాంపన్ ప్రాజెక్ట్ అనే సంస్థ నడుం కట్టింది. ఇందులో భాగంగా రేజీనా ఈ రోజు అమీర్ పెట్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరు అయింది.