హైదరాబాద్ ప్రజలను గాలికి వదిలేసి కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు!

Wednesday, July 8th, 2020, 12:16:33 AM IST


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ కి చెందిన, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘన కి పాల్పడ్డారు అని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే వారి పై తక్షణమే గవర్నర్ చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గవర్నర్ కి చిత్తశుద్ది ఉంటే అధికారాలను ఉపయోగించాలని కోరారు. అంతేకాక బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రసించారు. అయితే తెరాస, బీజేపీ కలిసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని వ్యాఖ్యానించారు.

అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలందరూ హైదరాబాద్ ను వదిలి వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మూడు రోజుల్లో కేబినెట్ భేటీ, లాక్ డౌన్ అనడం తో ప్రజలంతా సొంత ఊర్లకు వెళ్తున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ సెక్షన్ 8 పెట్టీ వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి అని కోరారు. అంతేకాక కరోనా వైరస్ మహమ్మారి నివారణ కోసం వచ్చిన కోట్ల రూపాయల విరాళాలు ఏం చేశారో చెప్పాలి అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రజలను గాలికి వదిలేసి కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు అని వ్యాఖ్యానించారు. సీఎం పర్యవేక్షణ లేని పాలన ను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ ది అని రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాక సీఎం, ప్రజా ప్రతి నిధుల ఆరోగ్యం పై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.