ఆ వైరస్ కి నివారణగా పనిచేసే ఏకైక టీకా ఎన్టీఆర్ – ఆర్జీవీ

Wednesday, April 21st, 2021, 09:20:11 AM IST

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తరచూ పలు అంశాల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారతారు. తాజాగా తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రామ్ గోపాల్ వర్మ. అయితే అదే విధంగా తెలుగు దేశం పార్టీ కి సంబందించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై సెటైరికల్ సినిమా తీశారు వర్మ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూపిస్తూ వర్మ తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ, విమర్శలు మాత్రం తరచూ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.

అయితే తాజాగా తెలుగు దేశం పార్టీ పై పలు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కు నారా లోకేష్ అనే వైరస్ పట్టుకుంది అని, అది ప్రాణాంతక వ్యాధి అని వ్యాఖ్యానించారు. అయితే దానికి నివారణ గా పనిచేసే ఏకైక టీకా ఒకటి ఉందని, దాని పేరే జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు తన సలహా అంటూ చెప్పుకొచ్చారు. విని త్వరపడండి, తెలుగు దేశం పార్టీ కి టీకా వేయండి అంటూ సలహా ఇచ్చారు. లేకపోతే మీరందరూ కూడా ఆ వైరస్ భారిన పడి చచ్చిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ గతంలో సెటైరికల్ కామెంట్స్ చేసినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడం తో పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. తెలుగు దేశం పార్టీ కి ఎన్టీఆర్ అవసరం ఉందని ఇప్పటికీ కూడా పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.