పెళ్లి కోసమే నటించిందట!

Saturday, April 4th, 2015, 05:58:18 PM IST


ముస్సోరీలోని ఐఏఎస్ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో అర్హత లేకుండా ట్రైనీగా ఏడు నెలల పాటు తిష్ట వేసిన లేడీ కిలాడి సంగతి తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ కు చెందిన ఈ కిలాడి రూబీ చౌదరి పెళ్లి కోసమే ఐఏఎస్ శిక్షణ తీసుకుంటున్నట్లు నాటకమాడిందని ఆమె భర్త వీరేందర్ మాలిక్ తెలిపారు. అలాగే రూబీ చౌదరి ట్రైనీ ఐఏఎస్ అధికారి అని చెప్పి ఆమె కుటుంబ సభ్యులు వివాహం కుదిర్చారని వివరించారు. ఇక దీనితో ఏడు నెలలుగా ఆమె ఐఏఎస్ శిక్షణ శిబిరంలోకి దొంగ ఐడి కార్డుతో ప్రవేశించి మకాం వేసినట్లు తెలుస్తోంది. అలాగే రూబీ చౌదరి తరచూ ముస్సోరికి వెళుతుండడంతో ఐఏఎస్ ట్రైనింగ్ కి వెళుతున్నట్లు తాను భావించానని ఆమె భర్త వాపోయారు.