వందో సినిమా గుసగుసలు – బాలయ్య కోటలో నాగ్ డైరెక్టర్..?

Saturday, February 20th, 2016, 06:56:53 PM IST


బాలకృష్ణ 99 వ చిత్రం రిలీజ్ అయ్యి నెల రోజులు దాటింది. 99 వ సినిమా షూటింగ్ లో ఉండగానే 100 సినిమా గురించి అనేక కబుర్లు బయటకు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కాని, ఇంతవరకు ఏ సినిమా కన్ఫామ్ కాలేదు. వారానికి ఒక దర్శకుడు తెరపైకి వస్తున్నాడు. డిక్టేటర్ నిర్మాణంలో ఉండగానే.. బాలకృష్ణ వందో సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. కాని, ఇంతవరకు అది కన్ఫామ్ కాలేదు. సరైనోడు తరువాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా ఉంటుంది అని వార్తలు వెలువడ్డాయి.

ఆ తరువాత వరసగా.. పరుచూరి రవీంద్ర, సింగీతం శ్రీనివాస రావు పేర్లు వినిపించాయి. సింగీతంతో బాలయ్య ఆదిత్య 999 చేస్తారాని కూడా వార్తలు వచ్చాయి. అదీ కన్ఫామ్ కాలేదు. తరువాత దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తారని కూడా వినిపించింది.. తరువాత ఇప్పుడు మరో వార్తా వినిపిస్తున్నది. టాలీవుడ్ లో అనేక హిట్ సినిమాలు తీసిన కృష్ణవంశి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణవంశి ప్రస్తుతం రుద్రాక్ష వంటి భారీ చిత్రం చేస్తున్నారు. ఇందులో అనుష్క, రమ్యకృష్ణ, సమంతలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇక, కృష్ణవంశి బాలకృష్ణకు ఓ సోషియో ఫాంటసి కథ వినిపించారని.. అది బాలకృష్ణ కు నచ్చిందని సమాచారం. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది కాలమే నిర్ణయించాలి.