వరల్డ్ కప్ అంబాసిడర్ గా సచిన్!

Monday, December 22nd, 2014, 02:47:03 PM IST


వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే వన్డే ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ కు భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైనట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. కాగా వచ్చే ఫిబ్రవరి నుండి జరిగే ఈ మెగా ఈవెంట్ కు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సంయుక్తంగా ఆతిధ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో జరిగిన గత ప్రపంచ కప్ లో సచిన్ చివరిసారి అంతర్జాతీయ క్రికెట్ లో ఆడగా భారత జట్టు ఘన విజయాన్ని సాధించింది. అటుపై సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ను ప్రకటించారు. ఇక ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు తీసిన ఘనత కూడా సచిన్ దే కావడం విశేషం. అలాగే ప్రపంచ కప్ అంబాసిడర్ గా సచిన్ ను ఐసీసీ వరుసగా రెండో సారి నియమించడం కూడా మరో విశేషమే!