బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ 50లోకి అడుగుపెట్టాడు

Sunday, December 27th, 2015, 12:13:55 PM IST


బాలీవుడ్ కండలవీరుడు ‘సల్మాన్ ఖాన్’ ఈ డిసెంబర్ 27న 50వ ఏటలోకి అడుగుపెట్టాడు. దీంతో పలువురు బాలీవుడ్ స్టార్లతో పాటు కోట్లాది మంది అభిమానులు ఆయనకు అన్ని రకాల సామాజిక మాధ్యమాలలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు. 50ఏళ్ళు వచ్చినప్పటికీ బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరంటే సల్మాన్ పేరే చెబుతారు. ఈ యేడు భజరంగీ భాయి జాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు సల్మాన్. అంతేగాక ఈ ఏడు మరో పెద్ద విశేషమేమిటంటే గత పుష్కర్క కాలంగా సల్మాన్ మీదున్న కేసును కూడా కోర్టు ఈ సంవత్సరమే కొట్టివేసింది.

మొత్తానికి ఈ సంవత్సరం సల్లూభాయ్ కి బాగా కలిసొచ్చింది. దీంతో సల్మాన్ ఈ 50వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొబోతున్నాడని వినికిడి. మరోవైపు సెలబ్రేషన్స్ విషయంలో సల్మాన్ నుంచి ఎటువంటి అఫిషియల్ కన్ఫర్మేషన్ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం సల్మాన్ సుల్తాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు సల్మాన్ గోల్డెన్ జూబ్లీ బర్త్ డే వేడుకలను బిగ్ బాస్ 9 సెట్లో జరపడానికి భారీగా సన్నాహాలు జరుగుతున్నాయని వినికిడి.