హిందూ సంప్రదాయంలో సల్మాన్ సిస్టర్ మ్యారేజ్

Wednesday, November 19th, 2014, 03:10:50 AM IST

Salman-Khan's-sister-Arpita
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహం ఢిల్లీ వ్యాపారవేత్త ఆయుష్ శర్మతో హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్ లో కలర్ ఫుల్ గా జరిగింది. కుటుంబ, బంధుమిత్రుల ఆశీర్వాదాల నడుమ ఆయుష్-అర్పిత ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్ తారలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

విందు కార్యక్రమం కూడా భారీగా సాగింది. హైదరాబాద్ బిర్యానీ, హలీం, పత్తర్ కా ఘోష్ వంటి నోరూరించే వంటకాలు అతిథులకు వడ్డించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వీఐపీలతో ప్యాలెస్ కళకళలాడింది.