సినిమా తరువాత ఆమెకు అదే ఇష్టమట..!

Saturday, January 2nd, 2016, 11:10:31 AM IST


సమంత.. టాలీవుడ్ హీరోయిన్. ఏం మాయ చేశావే చిత్రం ద్వారా అందర్నీ మాయచేసింది. పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి నటించింది. అయితే, తెలుగులో కొత్త హీరోయిన్స్ దూసుకుపోవడంతో అవకాశాలు కాస్త తగ్గాయి. కాని, తమిళంలో మాత్రం ఈ అమ్మడు దూసుకుపోతున్నది. ఇక తెలుగులో కూడా ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తున్నది. సినిమా అవకాశాలు అన్నవి ఎప్పటికైనా తగ్గిపోతాయి. అందుకే చాలా మంది హీరోయిన్లు వచ్చిన డబ్బును వివిధ సంస్థలలో పెట్టుబడిగా పెడుతుంటారు. కాని, సమంత మాత్రం అలా కాదట. తనకి అవకాశాలు తగ్గిపోయాక, సినిమా నుంచి తప్పుకోవలసి వస్తే.. సమాజం కోసం సేవ చేస్తానని చెప్తున్నది. సమంత ఇప్పటికే ఓ ట్రస్ట్ ని నడుపుతున్నది. ఆ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు సేవ చేస్తున్నది. భవిష్యత్తులో అదే కంటిన్యూ చేస్తానని అంటున్నది చిల్ బులి.