ఇది ‘సరైనోడి’ హెచ్చరిక..!

Thursday, March 10th, 2016, 11:34:48 AM IST


అల్లు అర్జున్ సరైనోడు చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇటీవలే ఓ సాంగ్ షూటింగ్ కోసం బొలివియా వెళ్ళారు. ఆక్కడ ఇప్పటివరకు ఎవరు షూటింగ్ చేయనటువంటి అందమైన ప్రదేశాలలో సాంగ్ ను షూట్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ఒకటి లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా చిత్రీకరిస్తున్న సాంగ్. దీంతో టీం అలర్ట్ అయింది. వెంటనే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ దాఖలు చేసింది. లీక్ అయిన సాంగ్ కు సంబధించిన వాటిని ఎవరైనా ఎలా వాడినా దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కోట్ల రూపాయల ఖర్చుపెట్టు పెట్టి తీస్తున్న సినిమా అని, లీక్ అయిన ఆడియో సాంగ్ ను ఎక్కడ ఎవరు ఉపయోగించవద్దని టీం విజప్తి చేస్తున్నది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకుంటున్నది. బొలివియాలో అందమైన లోకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ నెలలో సమ్మర్ స్పెషల్ గా సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నది. బోయపాటి దర్శకత్వం వస్తున్న ఈ సినిమా ఆయన గత చిత్రాలలాగే మంచి హిట్ సాధిస్తుందని బన్ని అభిమానులు అంటున్నారు.