సతి లీలావతి సినిమాలో గుండూస్ గా ముద్దుగా పిలిపించుకున్న మళయాళ నటి కల్పనా ఈ ఉదయం హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించారు. కేరళకు చెందిన కల్పనా ఇప్పటి వరకు మలయాళం, తమిళ్, తెలుగు భాషలలో 300 చిత్రాలలో నటించారు. సతి లీలావతి సినిమాతో ఆమె తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. ఇకపోతే, కల్పనా హైదరాబాద్ లోని ఓ హోటల్ లోని తన గదిలో అపస్మారకంగా పడిపోయి ఉండటం చూసిన సిబ్బంది ఆమెను హుటాహుటిన అపోలో హాస్పిటల్ కు తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించింది. హోటల్ లో ఉండగానే గుండెపోటు వచ్చిందని.. గుండెపోటు కారణంగానే ఆమె మరణించినట్టు వైద్యులు చెప్తున్నారు. ఇక కల్పనా డెడ్ బాడీ కి పోలీసులు పోస్ట్ మార్టం ఎక్కడ నిర్వహించాలి అనే విషయం గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
సతిలీలావతి ‘గుండూస్’ ఇకలేరు..!
Monday, January 25th, 2016, 11:40:38 AM IST