సత్య నాదెళ్ళకు అరుదైన ఘనత!

Thursday, April 16th, 2015, 09:58:09 AM IST


సాఫ్ట్ వేర్ రంగంలో ప్రపంచ దిగ్గజ కంపనీ మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగుతేజం సత్య నాదెళ్ళకు మరో అరుదైన గౌరవం లభించింది. కాగా ప్రపంచంలోనే అత్యధిక వార్షిక వేతనం తీసుకుంటున్న సీఈఓలలో సత్య నాదెళ్ళ ప్రధమ స్థానంలో నిలిచారు. అయితే సీఈఓ పదవిని చేపట్టిన రెండేళ్లకే సత్య ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కంపెనీ సత్య నాదెళ్ళకు సంవత్సరానికి 84.3 మిలియన్ డాలర్లు అనగా సుమారు 525కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని అందిస్తోంది.

కాగా గతేడాది ఈ జాబితాలో ఒరాకిల్ సీఈఓ లారీ ఎల్లిసన్ ఉండగా ఈ ఏడు సత్య నాదెళ్ళ ఆ స్థానాన్ని ఆక్రమించారు. ఇక తాజాగా వెలువడిన జాబితాలో పెప్సికో సీఈఓ, భారత సంతతి మహిళ ఇంద్రా నూయి 19వ స్థానంలో నిలిచారు. కాగా కార్పోరేట్ రంగంలో అత్యధిక వార్షిక వేతనం అందుకునే సీఈఓగా నిలిచిన సత్య నాదెళ్ళ తెలుగువాడి సత్తాను మరోసారి ప్రపంచానికి చాటారు.