నేడు రాజకీయ పార్టీలతో ఎస్ఈసి సమావేశం

Friday, April 2nd, 2021, 08:50:30 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి షెడ్యూల్ విడుదల అయిన సంగతి అందరికి తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా పదవీ విరమణ చేయడం తో కొత్తగా నీలం సాహ్ని ను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తుంది. ఈ నెల 8 వ తేదీన పొలింగ్, 10 వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అయితే దీని పై పూర్తి స్థాయిలో మరింత చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నేడు ఉదయం 11 గంటలకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల పై అఖిల పక్ష సమావేశం జరగనుంది. అయితే ఇప్పటికే ఈ అఖిల పక్ష సమావేశానికి పలు పార్టీలు దూరం ఉండనున్నాయి అని తెలుస్తోంది.