బాబా రాంపాల్ పై దేశద్రోహం కేసు

Wednesday, November 19th, 2014, 06:02:49 PM IST

బాబా రాంపాల్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై నిన్న రాంపాల్ అనుచరులు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించవలసి వచ్చింది. దీంతో మహిళలు…పెద్దవాళ్ళు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగులు మరణించారు. కాగ…మంగళవారం సాయంత్రం పోలీసులు బాబా ఆశ్రమ అధికారులపైన… ఆయన మద్దతుదారులపైన కేసులు పెట్టారు.

అయితే… బాబా రాంపాల్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పంజాబ్ హర్యానా హైకోర్ట్ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వానికి శుక్రవారం వరకు సమయం ఇచ్చింది. దీంతో నిన్న బాబా రాంపాల్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్ళగా… వారిపై బాబా అనుచరులు నాటు బాంబులతోను, రాళ్ళతోను దాడులు చేసిన విషయం తెలిసిందే.

నిన్న జరిగిన సంఘటనపై కేంద్రం స్పందించింది. ఈ విషయంలో పోలీసులు తొందరపాటుగా వ్యవహరించారని చురకంటించింది. కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే… ఇంత గొడవ వచ్చేది కాదని అన్నది.