భీభత్సం సృష్టించిన షేన్ వాట్సన్

Sunday, January 31st, 2016, 04:02:11 PM IST


ఆస్ట్రేలియా – భారత్ ల మధ్య జరుగుతున్న ఆఖరి టీ-20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పరుగుల వరద పారించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో షేన్ వాట్సన్ భీభత్సం సృష్టించాడు. 71 బంతుల్లోనే 121 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు చేయగలిగింది.

టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లందరూ ఒకరి తరువాత ఒకరు అవుటవుతున్నా వాట్సన్ మాత్రం దూకుడు తగ్గించకుండా వీరబాదుడు బాదాడు. ఇక భారత బౌలర్లలో నెహ్రా, జడేజా, బుమ్రా, అశ్విన్, యువరాజ్ లు తలా ఒక వికెట్ తీసుకున్నారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తరపున రోహిత్ శర్మ 16, ధావన్ 26 పెరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత స్కోరు 3.2 ఓవర్లు ముగిసేసరికి 46/1 గా ఉంది.