శారదా స్కాంలో మమత పాత్ర ?

Tuesday, November 25th, 2014, 03:10:12 AM IST


పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శారద చిట్ ఫండ్ స్కాంలో అనేక పెద్ద తలకాయలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ స్కాం విషయంలో ఇటీవలే అరెస్ట్ అయి జైలులో ఉన్న తృణముల్ కాంగ్రెస్ మాజీ ఎంపి కునాల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శారదా గ్రూప్ చిట్ స్కాం వ్యవహారంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్కువ లాభపడ్డారని ఆయన పేర్కొన్నారు. మమతా బెనర్జీని తన సమక్షంలో సిబిఐ విచారణ చేయాలని… అప్పుడే అన్ని నిజాలు బయటపడతాయని కునాల్ ఘోష్ అన్నారు.
ఈ స్కాం విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. శారదా చిట్ ఫండ్ స్కాం వ్యవహారంతో తనకు సంబంధం లేదని అన్నారు. తను హస్తం ఉన్నట్టు కనుక నిరూపిస్తే.. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపింది. ఇక కేంద్రం సిబిఐ ని దుర్వినియోగం చేస్తున్నదని… కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రతిపార్టీ ఇలాగే ప్రవర్తిస్తున్నదని అన్నారు. పార్టీలో ఎవరో కొందరు తప్పులు చేస్తే… దాన్ని పార్టీ మొత్తం తప్పుచేసినట్టు చెప్పడం మంచిది కాదని ఆమె అన్నారు.