చంద్రబాబుకు షాక్.. ఏపీకి నెంబర్ వన్ స్థానం

Friday, July 1st, 2016, 03:10:37 PM IST


ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పధంలో నడవాలంటే పాలనలో పారదర్శకత అవసరం. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావాలంటే అవినీతి లేని పాలన మరీ అవసరం. కొత్త రాష్ట్రంగా అవతరించి పెట్టుబడుల వేటలో తీవ్రంగా కష్టపడుతున్న ఏపీ ప్రభుత్వానికైతే ఇది మరీ అవసరం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ టూర్లు వేసి మరీ పెట్టుబడులు తీసుకొస్తున్నారు. కానీ లోపల మాత్రం పాలనా యంత్రాంగం అవినీతితో నిండిపోయింది.

ఇటీవలే నేషనల్ కౌన్సిల్ ఫేర్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో ఏపీ అవినీతిలో దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలోని ప్రజల్లో 74.3 శాతం జనాభా అవినీతి వల్ల ఇబ్బంది పడుతున్నట్లు సర్వే తేల్చింది. బాబు బయట పనుల్లో ఉంటే అధికారులు అదే తడవుగా దొరికినంత నొక్కేస్తున్నారు. ఈ పద్దతి గనుక ఇలాగే కొనసాగితే నవ్యఆంధ్ర కలలు అర్థాంతరంగా ఆగిపోవడం ఖాయం.