‘నిర్భయ’ డిఫెన్స్ లాయర్లకు నోటీసులు!

Saturday, March 7th, 2015, 06:49:17 PM IST

layre
ఢిల్లీలో సంచలనం రేపిన నిర్భయ ఘటనపై న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తున్న డిఫెన్స్ లాయర్లకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) షోకాస్ నోటీసులు జారీ చేసింది. కాగా నిర్భయ ఉదంతంపై ఇంగ్లీష్ ఫిలిం మేకర్ రూపొందించిన ‘ఇండియాస్ డాటర్’ డాక్యుమెంటరీలో డిఫెన్స్ లాయర్లు ఎంఎల్ శర్మ, ఏపీ సింగ్ లు చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని బార్ కౌన్సిల్ పేర్కొంది.

ఈ నేపధ్యంగా ఆ ఇద్దరు న్యాయవాదులకు షోకాస్ నోటీసులను జారీ చేసినట్లు బీసీఐ చైర్మన్ మనన్ మిశ్రా పేర్కొన్నారు. కాగా డిఫెన్స్ న్యాయవాదులు నిర్భయ డాక్యుమెంటరీలో మహిళను కుక్కలతో పోలుస్తూ వ్యాఖ్యలు చెయ్యడంతో సర్వత్రా దుమారం రేగింది. ఇక దీనిపై మహిళా సంఘాలతో పాటు న్యాయ నిపుణులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా స్పందించి బార్ కౌన్సిల్ పై వత్తిడి తేవడంతో సదరు లాయర్లకు షోకాస్ నోటీసులను జారీ చేసినట్లు సమాచారం.