విడిపోయినా.. కొట్టుకుంటున్న సినీ ప్రేమపక్షులు..!

Saturday, November 28th, 2015, 07:03:16 PM IST


ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు.. వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు రావు. చిన్న చిన్న గొడవలు వచ్చినా.. అవి చాలా తీయగా ఉంటాయి. అయితే, విడిపోయిన తరువాత.. అవే తప్పులు పెద్దవిగా మారిపోతాయి. ఇద్దరు బహిరంగంగా కాకపోయినా.. ఎవరో ఒకరి దగ్గర వారి తప్పుల గురించి ప్రస్తావిస్తారు అన్నది వాస్తవం. ఇటువంటి సంఘటనలు మామూలు మనుషుల జీవితంలోనే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా జరుగుతుంది.

హీరో సిద్దార్ధ.. హీరోయిన్ సమంతలు ప్రేమించుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే, ఏమి జరిగిందో ఏమో తెలియదు కాని… ఇద్దరు విడిపోయారు. చాలా కాలం తరువాత.. మొన్న సిద్దార్ధ ట్విట్టర్ లో ” గతంలో నీకు ఎటువంటి చెడు జరిగినా.. అదంతా నీ మంచికే అని నీకు తెలిసిన తరువాత మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది” అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఎవరి గురించి చేశారో తెలియదు. అయితే, ఈ ట్వీట్ పై సమంత స్పందించింది. “అసలు నువ్వు ఎవరివో పరిచయం లేనంత మామూలు మనిషివని నేను అనుకుంటున్నాను” అని ట్వీట్ చేసింది. సిద్దార్ధ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశాడు.. సమంత ఎందుకు దానిపై స్పందించింది అని చెవులు కొరుక్కుంటున్నారు.