‘అమ్మ’ లేకుంటే మరణమే శరణ్యం

Monday, September 29th, 2014, 02:52:15 PM IST


‘పురిచ్చితలైవి’ జయలలితను తమిళనాడు ప్రజలు పిలుచుకునే పేరు. అమ్మ అంటే అక్కడి ప్రజలకు దైవంతో సమానం..అమ్మ కోసం అక్కడి ప్రజలు ఏమైనా చేస్తారు.. ఎందుకంటే.. ఆమెకు ప్రజల సమస్యలేంటో… వారి ఇబ్బందులు ఏంటో తెలుసు.. జయలలిత జీవితం ప్రారంభం అయింది.. కష్టాలకడలిలోనుంచే.. జయలలిత.. చిన్నతనంలోనే సినిమాలలోకి వచ్చింది.. సినిమా రంగంలో ఉంటూనే.. చదువుకుంది..చెప్పాలంటే జయలలిత పుస్తకాల పురుగు.. పుస్తకాలే ఆమె నేస్తం..పుస్తకాలనుంచే కాకుండా.. తను ఎదుర్కొన్న సమస్యలనుంచి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకున్నది.

ఎంజీఆర్ మరణం తరువాత.. అన్నాడీఎంకె పగ్గాలు చేపట్టింది… ముక్కుసూటి మనస్తత్వం గల జయలలిత రాజకీయాలో అంచెలంచెలుగా ఎదిగి ప్రజాదరణ పొందిన నేతగా.. ప్రతిభావంతమైన ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందారు.. ప్రజలకు అవసరమైన ఎన్ని పధకాలను జయలలిత రూపొందించారు. ప్రజలకు చేరువకావడానికి ఆమె అన్నివిధాలుగా ప్రయత్నించారు. అన్నింటిలో విజయం సాధించారు.. ప్రజలచేత ముద్దుగా అమ్మ అని పిలిపించుకున్నారు.. అయితే.. అద్దానికి మరకలు పడినట్టు.. జయలలిత నేడు కటకటాలపాలయింది..

అమ్మ జైలుకు వెళ్ళిన విషయం తెలియగానే.. తమిళనాడులో ఆందోళనలు మొదలయ్యాయి. పార్టీలకు అతీతంగా.. సామాన్యప్రజలనుంచి ఈ ఆందోళనలు మిన్నంటాయి.. కారణం అమ్మ చేసిన మంచి పనులే.. అమ్మ జైలువెళ్ళిన విషయం తెలియగానే తమిళనాడులో దాదాపు 16మంది చనిపోయారు.. అమ్మ లేకపోతే తాము బతికుండటం అనవసరమని ఇంకా చాలామంది ఆత్మహత్యలు చేసుకునేందుకు ప్రయత్నించారని తెలుస్తున్నది.. అమ్మ కోసం ఏమైనా చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని నాయకులు అంటున్నారు.. అయితే, ఎవరు తొందరపడి ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.