పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోలేక పోతున్నారు – సోము వీర్రాజు

Wednesday, April 14th, 2021, 01:05:36 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నింటిలోనూ అసమర్థుడు అని సోము వీర్రాజు అన్నారు. వాలంటీర్ల తో ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు వేయనీయకుండా చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే బీజేపీ – జన సేన అంటే వైసీపీ నాయకులు భయ పడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే బీజేపీ కి వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలకి నిద్ర పట్టట్లేదు అంటూ విమర్శించారు. అయితే జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోలేక పోతున్నారు అని విమర్శలు గుప్పించారు. అయితే ఈ తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో వైసీపీ కి ప్రజలు బుద్ధి చెబుతారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ నేతలు చేస్తున్న వరుస విమర్శలకు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టి కౌంటర్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.