తమ పార్టీ కార్యకర్తలను కూడా కాపాడుకోలేని అసమర్థుడు చంద్రబాబు – సోము వీర్రాజు

Thursday, April 1st, 2021, 07:32:01 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ప్రక్రియ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలనే తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను అంటూ సాము వీర్రాజు చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు తమ పార్టీ కార్యకర్తలను కూడా కాపాడుకోలేని అసమర్థుడు అంటూ విమర్శించారు. అయితే రజకుల ఎస్సీ ల్లో చేర్చాలని, కాపులను బీసీల్లో చేర్చేందుకు తాము మద్దతు తెలుపుతాం అని వ్యాఖ్యానించారు. అయితే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చంశనీయం గా మారాయి.

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ కి చెందిన నేతలు స్పందిస్తున్నారు. పొత్తు పెట్టుకున్న జన సేన పై, బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కి, ఉమ్మడి సీఎం అభ్యర్ధి కి లింక్ ఎంటి అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.