హాట్ టాపిక్ : శ్రీలంక ప్రపంచ కప్ ను భారత్ కి అమ్మేసింది

Friday, June 19th, 2020, 02:18:38 PM IST

భారత్ క్రికెట్ చరిత్రలో వన్డే ప్రపంచ కప్ ను రెండు సార్లు సొంతం చేసుకుంది. 1983 లో ఒకసారి, 2011 లో ఒకసారి. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ 2011 లో వన్డే ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. భారత్ యువ ఆటగాళ్లకు ఆ కప్ ఊపిరి పోసింది. అయితే మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యం లో గెలుపొందిన ఈ ప్రపంచ కప్,.ఫైనల్ లో శ్రీలంక తో తలపడింది. అయితే ఈ మ్యాచ్ పై శ్రీలంక కి చెందిన మాజీ మంత్రి మహిందనండ అలుత్గమగే పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

2011 లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది అని అన్నారు. శ్రీలంక ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ను భారత్ కి అమ్మేశింది అని మహిందనంద సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాలను వెల్లడించారు. అంతేకాక అపుడు తను క్రీడా మంత్రిగా ఉన్నా అని, ఆనాడే ఈ విషయం చెప్పా అని వ్యాఖ్యానించారు.

అయితే అపుడు కెప్టెన్ లుగా వ్యవహరించిన సంగక్కర మరియు మహీల జయవర్ధనే ఈ వ్యాఖ్యల పై స్పందించారు. మహిందనందా చేసిన వ్యాఖ్యలని ఖండించారు. ఆరోపణలు కాకుండా, ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపించండి అని వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్ అనంతరం సంగక్కర తన కెప్టెన్సీ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.