ఇది తెరాస కరపత్రం

Wednesday, November 5th, 2014, 05:08:20 PM IST


తెలంగాణ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతుల ఆత్మహత్యలకు ఏవిధమైన పరిష్కారం కనుగొంటారో.. ఏవిధమైన విధానాలు అవలంభిస్తారో స్పష్టమైన వివరాలు ఇవ్వలేదని తెలంగాణ కాంగ్రెస్ నేత డి. శ్రీనివాస్ అన్నారు. ముఖ్యంగా బడ్జెట్ ప్రసంగం అంతా గత ప్రభుత్వాలను నిందించడంతోనే సరిపోయిందని.. కొత్తగా తెలంగాణ ప్రజల కోసం ఈ బడ్జెట్ లో చేసింది ఏమి లేదని డిఎస్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం తెరాస కరపత్రం వలే ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు.

బడ్జెట్ లో అంకెలకే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. బడ్జెట్ ఏ ఒక్క వర్గాన్ని సంతోషపెట్టలేకపోయిందని ఆయన మండిపడ్డారు.