తెలంగాణ రాష్ట్రం లో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ సారి చాలా రసవత్తరంగా సాగనున్నాయి. అధికార పార్టీ కి మొన్న దుబ్బాక ఉపఎన్నిక తో బీజేపీ ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చూపేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ నేపథ్యం తమ మూడు లక్షల మంది మద్దతు తెరాస కే అంటూ రాష్ట్ర మరాఠ సమాజ్ సంచలన ప్రకటన చేసింది. మరాఠా సమాజ్ కి చెందిన వారిలో దాదాపు మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు సమాజ్ నాయకులు తెలిపారు.
అయితే మరాఠా సమాజ్ ప్రతినిధి బృందం ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ను మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసం లో కలిసి తెరాస కి మద్దతు ఇస్తున్నట్ల ప్రకటించారు. మరాఠా సమాజ్ తమ సొంత ఖర్చులతో తెరాస కార్పొరేటర్ల విజయం కోసం వాహనాలను ఏర్పాటు చేసుకొని ప్రచారం నిర్వహించ నున్నట్లు సమాజ్ అధ్యక్షులు తెలిపారు. అయితే మూడు లక్షల మంది ఓటర్లు మద్దతు ఇవ్వడం తెరాస కి బలమైన విషయం అని చెప్పాలి.