‘బాహుబలి’ యాంకరింగ్ చాన్స్ కొట్టేసింది!

Saturday, June 13th, 2015, 01:45:40 PM IST


టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించినబడిన ‘బాహుబలి’ ఆడియో నేడు తిరుపతిలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఆడియో ఫంక్షన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు ప్రముఖ టాలీవుడ్ నటుడు నానిని తొలుత సంప్రదించగా అతను ఆనందంగా అంగీకరించారు. అయితే ఇప్పుడు నాని ఒక షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు గాయపడడంతో, యాంకరింగ్ చేసే బాధ్యత ప్రముఖ యాంకర్ సుమ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర దర్శకుడు రాజమౌళి ఈ విషయాన్నీ నిర్ధారిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

కాగా తెలుగు చిత్రసీమలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, యువ హీరోలు ప్రభాస్, రాణా, హీరోయిన్లు అనుష్క, తమన్నా వంటి భారీ తారాగణం సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక ఇటీవలే విడుదలైన బాహుబలి ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉండడంతో ఈ చిత్రం కోసం అభిమానులు మరింత ఆతృతగా ఎదురు చూస్తున్నారు.