ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పెట్టిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Tuesday, March 9th, 2021, 12:48:50 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే ఎన్నికల కొరకు నూతన నోటిఫికేషన్ ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై హైకోర్టు లో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా, ఫలితం లేకపోయింది. అయితే సుప్రీం కోర్టులో మరొక పిటిషన్ దాఖలు అయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మునిసిపాలిటి ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పెట్టిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. పిటిషన్ ను తిరస్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలి, కొత్త నోటిఫికేషన్ అవసరమా లేదా అన్నది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విచక్షణాధికారం అంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలు చోట్ల బలవంతపు ఉపసంహరణ లు, బెదిరింపులు జరగడం వలన కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ పలువురు కోరుతున్నారు.అయితే తాజాగా సుప్రీం కోర్టు సైతం ఈ నిర్ణయం తీసుకోవడం తో వారికి నిరాశ ఎదురైంది అని చెప్పాలి.