దేశాభివృద్ధిలో భాగస్వాములు కండి!

Wednesday, January 7th, 2015, 03:12:34 PM IST


కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం అహ్మదాబాద్ గాంధీ నగర్ లో ప్రారంభమైన ప్రవాస్ భారతీయ దివస్ లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నారై యువతతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని ఎన్నారై యువతకు పిలుపునిచ్చారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ కమ్, కనెక్ట్, సెలెబ్రేట్, కంట్రిబ్యూట్ అనే నాలుగు ‘సీ’ ల ప్రాముఖ్యతను విదేశీ యువతకు వివరించారు. అలాగే స్వదేశంలో ఎన్నారైలు వ్యాపారాలు నిర్వహించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుష్మా తెలిపారు. ఇక దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో తమ సర్కారు చేపట్టిన విధివిధానాలను పారదర్శకంగా అమలు పరుస్తున్నట్లు సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు.