స్వచ్చభారత్ ఓకే..రాజకీయాలపై నో కామెంట్ – కుష్బూ

Wednesday, November 26th, 2014, 04:08:28 PM IST

kushboo
తాను బీజేపిలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలలో ఎటువంటి నిజాలు లేవని… తాను బీజేపితో సహా ఏ పార్టీలో చేరడం లేదని అన్నారు. అయితే.. భారత ప్రధాని మోడీ ప్రారంభించిన స్వచ్చభారత్ కార్యక్రమానికి కుష్బూ మద్దతు పలికారు. మోడీ భారత ప్రజలకు ఒక దారి చూపించారని… దేశానిలో సేవ చేసేందుకు మనకు ఇదొక అవకాశమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు వీరు అని కాకుండా.. ప్రతిఒక్కరు స్వచ్చభారత్ లో పాల్గొనాలని ఆమె కోరారు.

దేశం క్లీన్ గా ఉండాలని గాంధి మహాత్ముడి కల అని.. ఆ కలని మోడీ ద్వారా సాకారం అవుతున్నదని అన్నారు. అయితే.. స్వచ్చభారత్ కు మద్దతు ఇస్తున్నానని అంతేకాని… బీజేపిలో చేరడం లేదని అన్నారు.

ఇంతకుముందు కుష్బూ డిఎంకె పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో చేరిన అనతికాలంలోనే ఆమె డిఎంకె పార్టీలో కీలక పదవిని అలంకరించారు. కొంతకాలం క్రితం ఆమె డిఎంకె పార్టీ నుంచి బయటకి వచ్చింది. అయితే… ఇప్పుడు ఆమె బీజేపి లో చేరబోతున్నట్టు ఊహాగానాలు వచ్చాయి.