తాడోపేడో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలుస్తాం!

Tuesday, January 13th, 2015, 03:48:48 PM IST

talasani-srinivas
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మంగళవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనత్ నగర్ ఉపఎన్నికలలో ఎవరిది గెలుపో తేల్చుకుందామని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏజెంట్ల సత్తా తెలిసిందని తీవ్రంగా విమర్శించారు. అలాగే టిడిపి బలమేంటో కంటోన్మెంట్ ఎన్నికలలో తేలిపోయిందని తలసాని ఎద్దేవా చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ కంటోన్మెంట్ లో తెరాస సత్తా చూపించిందని, చైర్మన్ ఎవరన్నది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. అలాగే సనత్ నగర్ ఎన్నికల వరకు ఎందుకని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పత్తా లేకుండా పోతుందని తలసాని అభిప్రాయపడ్డారు. ఇక టిడిపితో తాడో పేడో జీహెచ్ఎంసీ ఎన్నికలలో తేల్చుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కాగా తలసాని ఇటీవల తెలుగుదేశం పార్టీ నుండి టిఆర్ఎస్ లోకి మారి మంత్రి పదవిని దక్కించుకున్న సంగతి తెలిసిందే.